నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మూవీ ఫిక్స్ అయింది. వాస్తవానికి ఎప్పుడో మోక్షజ్ఞ సినిమా మొదలు కావాల్సి ఉన్నా కూడా వివిధ కారణాలతో అది ముందుకు సాగలేదు. గతంలో హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మతో అధికారికంగానే సినిమా ప్రకటించారు. కానీ కారణాలు ఏంటో తెలియదు కానీ...ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఇప్పుడు మోక్షజ్ఞ ఏ బ్యానర్ పై సినిమా చేయనున్నాడు...దర్శకుడు ఎవరు అన్న విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించారు. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించనుంది. బింబిసార డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఆదివారం నాడు మోక్షజ్ఞ పుట్టిన రోజు కావటంతో ఈ సినిమా సినిమా ప్రకటన వెలువడింది.

                                             Full Viewకూన గుహను వీడింది. సింహంలా అడివిలోకి అడుగుపెట్టింది అంటూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ఈ సినిమా విషయాన్ని ప్రకటించింది. గతంలో నందమూరి కళ్యాణ్ రామ్ కు బింబిసార వంటి హిట్ మూవీని అందించిన దర్శకుడు వశిష్ట తో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ కావటంతో మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి బాలకృష్ణ ఫాన్స్ లో నెలకొంది. చిరంజీవి హీరో గా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వంభర సినిమా విడుదల కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. దర్శకుడిగా రెండవ సినిమాకే చిరంజీవి తో సినిమా చేసిన వశిష్ట ఇప్పుడు మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టడంతో టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Tags: