మంచు విష్ణు కొత్త సినిమా అమెజాన్ లో

Update: 2025-09-04 07:37 GMT

మంచు విష్ణు కీలక పాత్రలో నటించిన కన్నప్ప సినిమా ఓటిటి లోకి వచ్చేసింది. సెప్టెంబర్ నాలుగు నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. కానీ కొంత ఆలశ్యంగా ఈ సినిమా స్ట్రీమింగ్ స్టార్ట్ కావటంతో పలువురు నెటిజెన్స్ ఇదే అంశంపై సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టారు. దీనికి అమెజాన్ స్పందిస్తూ కన్నప్ప స్ట్రీమింగ్ స్టార్ట్ అయినట్లు గురువారం ఉదయం పదిగంటల సమయంలో అధికారికంగా పోస్ట్ పెట్టింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను తెరకెక్కించినట్లు మంచి మోహన్ బాబు, మంచు విష్ణులు పలు మార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

                                కన్నప్ప మూవీ లో ప్రభాస్ తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించటంతో ఈ మూవీ కి మంచి బజ్ క్రియేట్ అయింది. జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. వాస్తవానికి కన్నప్ప రోల్ పోషించిన మంచు విష్ణు తో పాటు రుద్ర పాత్రలో ప్రభాస్, కిరాతగా మోహన్ లాల్ లు తమ తమ పాత్రలకు జీవం పోసినా కూడా వసూళ్ల పరంగా ఈ సినిమా మంచి ఫలితాన్ని సాధించలేకపోయింది.

                             మోహన్ బాబు కూడా మహాదేవశాస్త్రి పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నాడు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిన ఈ సినిమా ఓటిటి లో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి. దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీసినట్లు అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా కు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ 50 కోట్ల రూపాయల లోపే. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే విమర్శకులు సైతం కన్నప్ప సినిమా లో మంచి విష్ణు నటనపై ప్రశంసలు కురిపించారు. మోహన్ బాబు ఫ్యామిలీ పై సోషల్ మీడియా లో జరిగిన నెగిటివ్ ప్రచారం కూడా ఈ సినిమా ఫలితంపై కొంత ప్రభావం చూపించింది అనే అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News