రాజకీయాలను తలపించేలా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో విజయం దక్కించుకున్న మంచు విష్ణు వరస పెట్టి సినీ ప్రముఖులతో సమావేశం అవుతున్నారు. ఆయన గురువారం నాడు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. మంచు విష్ణుతోపాటు మా కోశాధికారి శివబాలాజీ కూడా ఉన్నారు. ఈనెల 16 వ తేదీన జరిగే మా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రిని ఆహ్వానించారు. మంచు విష్ణుతోపాటు నూతన కమిటీ మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలిపారు.