Full View'మంచి రోజులోచ్చాయి' ట్రైలర్ లో సందడే సందడి. దర్శకుడు మారుతి సినిమా అంటే ఏదో ఒక వైరైటీ ఉండటం ఖాయం. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే కన్పించబోతుంది. ట్రైలర్ చూస్తే సినిమాలో హంగామా, కామెడీ ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలిసిపోతుంది. 'మై వాట్సాప్ అంకుల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్.. నా పేరు సంతోష్.. ఆనందానికి కేరాఫ్ అడ్రెస్.. వీడు అనేది నా ట్యాగ్‌లైన్' అంటూ సంతోష్ శోభన్ తనను తాను పరిచయం చేసే సన్నివేశంతో ట్రైలర్ మొదలైంది. ఇక 'నా కూతురు లాంటి కూతురిని కన్న ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాల్సిందే.. అంటూ అశిష్ ఘోష్ మెహ్రీన్ గురించి చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
కరోనా పోయి సాధారణ స్థితికి వస్తుందనే సందేశంతో ఈ సినిమా తెరకెక్కించినట్లు కన్పిస్తోంది. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్ సన్నవేశాల్లో మళ్ళీ లాక్ డౌన్ అదీ వస్తే ఇబ్బంది అంటూ హీరో చేసే చిలిపి పనులు కూడా ట్రైలర్ లో ఉన్నాయి. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన చిత్రమే 'మంచి రోజులు వచ్చాయి'. నవంబర్ 4న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ట్రైలర్ ద్వారా తెలిపింది. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, అశిష్ ఘోష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఏక్ మినీకథ సినిమాతో సంతోష్ శోభన్ మంచి హిట్ అందుకున్నారు.