టికెట్ రేట్ల పెంపునకు కూడా

Update: 2026-01-09 14:59 GMT

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రీమియర్స్ కు అనుమతి మంజూరు చేసింది. ఈ స్పెషల్ షో టికెట్ ధరను 500 రూపాయలుగా నిర్ణయించారు. అదే సమయంలో జనవరి 12 నుంచి 10 రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వేసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ షో జనవరి 11న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ప్రదర్శించుకోవచ్చు అని ప్రభుత్వం మెమో లో పేర్కొంది. ఈ సినిమా కు అదనంగా సింగిల్ స్క్రీన్ లలో రూ.100, మల్టీప్లెక్స్ లలో రూ.125 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి బజ్ నెలకొంది.

                                            నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సాహు గారపాటి మరియు సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గత సంక్రాంతికి వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ డూపర్ హిట్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ కావటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి రేసులో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్ విడుదల కాగా...పండగ రేస్ లో రెండవ సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News