'మేజర్' సినిమా విడుదల జులై2న

Update: 2021-01-29 09:37 GMT

అడవిశేష్ హీరోగా నటిస్తున్న 'మేజర్' సినిమా విడుదల తేదీ కూడా వచ్చేసింది. టాలీవుడ్ గతంలో ఎన్నడూలేని రీతిలో వరస పెట్టి కొత్త సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తూ పోతుంది. అందులో భాగంగా మేజర్ విడుదల తేదీ కూడా వచ్చింది. ఈ సినిమాలో అడవి శేష్ కు జోడీగా శోభిత ధూళిపాళ నటిస్తున్నారు.

శశికరణ్ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ తోపాటు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి. తెలుగుతోపాటు హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 2008లో జరిగిన ముంబయ్ దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నిక్రిష్ణన్ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

Tags:    

Similar News