కీర్తి సురేష్ కు మహేష్ బాబు విషెస్

Update: 2020-10-17 06:39 GMT

కీర్తి సురేష్ పుట్టిన రోజు అక్టోబర్ 17. దీంతో ఈ భామకు టాలీవుడ్ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి. మహానటి సినిమాతో ఒక్కసారిగా కీర్తి సురేష్ రేంజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె తెలుగులో పలు సినిమాలో చేస్తోంది. అందులో మహేష్ బాబుకు జోడీగా 'సర్కారు వారి పాట' సినిమా కూడా ఉంది. ఈ సినిమా హీరో మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.

'టాలెంటెడ్‌ కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. 'సర్కార్‌ వారి పాట' టీంలో చేరటానికి స్వాగతం పలుకుతున్నాం. కచ్ఛితంగా ఈ సినిమా మీ జీవితంలో ఒక మంచి గుర్తుగా మిగిలిపోతుంది' అని మహేష్‌ బాబు ట్వీట్‌ చేశారు. నితిన్ తో కలసి కీర్తి సురేష్ రంగ్ దే సినిమాలో కూడా నటిస్తోంది.

Tags:    

Similar News