మహేష్ బాబు..రణ్ వీర్ సింగ్ ఫోటో వైరల్

Update: 2020-12-26 07:54 GMT

ఒకరు టాలీవుడ్ సూపర్ స్టార్. మరొకరు బాలీవుడ్ స్టార్ హీరో. వాళ్లిద్దరూ కలసి ఓ యాడ్ చేస్తే. అది వారి వారి అభిమానులకు ఓ పండగే. ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు ఫుల్ కుషీలో ఉన్నారు. రణ్ వీర్ సింగ్ తో కలసి మహేష్ బాబు ఓ యాడ్ లో నటించారు. దీనికి సంబంధించిన ఫోటోను రణ్ వీర్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మహేష్ బాబును బిగ్ బ్రదర్ అంటూ సంభోదించారు.

మహేష్ బాబు తో కలసి పనిచేయటంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. 'నేను కలసి పనిచేసిన గొప్ప వ్యక్తుల్లో మహేష్ బాబు ఒకరు. మనిద్దరి మధ్య జరిగే సంభాషణలు ఎప్పటికి విలువైనవే. బిగ్ బ్రదర్ పట్ల నాకెంతో ప్రేమాభిమానాలు ఉన్నాయని' అని పేర్కొన్నారు. దీనిపై మహేష్ బాబు కూడా స్పందించారు. మనిద్దరి భావన ఒక్కటే. మీతో కలసి పనిచేయటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

Tags:    

Similar News