టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎక్కువగా ఫ్యామిలీ తో కలిసి విదేశీ టూర్లు చేసే వాళ్లలో మహేష్ బాబు ముందు వరసలో ఉంటారు. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా కూడా ఆయన ఫ్యామిలీ తో ట్రిప్ వెళతారు. కాకపోతే ఇప్పుడు ఆయన కు ఆ ఛాన్స్ మిస్ అయ్యేట్లు కనిపిస్తోంది. ఎందుకలా అంటారా?. మహేష్ బాబు పాస్ పోర్ట్ ను దర్శకుడు రాజమౌళి సీజ్ చేశారు. సింహన్ని బోనులు బంధించినట్లు ఒక చిన్న వీడియో ను విడుదల చేశారు. అది కూడా చేతిలో పాస్ పోర్ట్ పట్టుకుని పోజ్ ఇచ్చారు. మహేష్ బాబు ను తాను లాక్ చేసినట్లు చెప్పకనే చెప్పేశారు. దీంతో ఇక నుంచి మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ ఎంబి 29 మూవీ షూటింగ్ శరవేగంగా సాగబోతున్నట్లు ఆయన ఇండికేషన్ ఇచ్చారు.
వాస్తవానికి రాజమౌళి ఈ వీడియో కింద పట్టేసికున్నట్లు క్యాప్షన్ పెట్టగా ..సోషల్ మీడియా లో మాత్రం అందరూ సీజ్ ది పాస్ పోర్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఈ మేరకు పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా రాజమౌళి పెట్టిన పోస్ట్ కు ఆమె స్పందించటంతో ఈ సినిమాలో ఆమె ఉన్నారు అనే విషయం కన్ ఫర్మ్ అయినట్లు అయింది అనే చర్చ సాగుతోంది. మహేష్ బాబు కూడా రాజమౌళి వీడియో పై స్పందిస్తూ ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే డైలాగు పెట్టారు.