నితిన్ అంథుడుగా నటిస్తున్న సినిమా 'మ్యాస్ట్రో'. ఇందులో హీరోగా జోడీగా నభా నటేష్, తమన్నాలు సందడి చేయనున్నారు. త్వరలోనే ఇది ఓటీటీలో విడుదల కానుంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయినా ఏంటో ఈ జీవితం. సినిమాల్లో మర్డర్ చూడటానికే భయపడే నేను..ఇప్పుడు మర్డర్ చేయాల్సి వచ్చింది అంటూ నితిన్ తో తమన్నా చెప్పే డైలాగ్ ట్రైలర్ లో హైలెట్ గా ఉంది.