ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్స్

Update: 2025-03-29 06:57 GMT
ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్స్
  • whatsapp icon

టాలీవుడ్ లో ఈ వారం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో ఒకటి నితిన్ రాబిన్ హుడ్ అయితే...రెండవ సినిమా మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ మూవీ యూత్ ను బాగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో మ్యాడ్ స్క్వేర్ పై కూడా అంచనాలు బాగానే పెరిగాయి. చిత్ర యూనిట్ కూడా ఇదే దిశగా ప్రమోషన్స్ చేసింది. తమ సినిమాలో కథ గురించి ఆలోచించవద్దు అని...రెండు గంటల పాటు హాయిగా నవ్వుకుని వెళ్లే సినిమానే ఇది అంటూ చెప్పుకొచ్చారు. అయితే విడుదల తర్వాత మాత్రం మ్యాడ్ తో పోలిస్తే మ్యాడ్ స్క్వేర్ లో అంత ఫన్ లేదు అనే టాక్ వచ్చింది. అయినా కూడా రాబిన్ హుడ్ తో పోలిస్తే ఈ సినిమా కే సాలిడ్ బుకింగ్స్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతో కొంత ఫన్ ఉండటంతో యూత్ అంతా మ్యాడ్ స్క్వేర్ వైపు ఆకర్షితులు అవుతున్నారు.

                                                             ఈ సినిమాకు వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 20. 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ కి మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కి భీమ్స్ సంగీతం అందించగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ మ్యాడ్ స్క్వేర్ ను తెరకెక్కించారు. 

Tags:    

Similar News