అత్యంత ఉత్కంఠగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అత్యంత కీలకమైన కోశాధికారి పోస్టును విష్ణు ప్యానల్ నుంచి బరిలో నిలిచిన శివబాలాజీ విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున ఉన్న నాగినీడుపై ఆయన విజయం సాధించారు. ఫలితం వెలువడిన వెంటనే శివబాలాజీనీ మంచు విష్ణు కౌగిలించుకుని అభినందనలు తెలిపారు. పోలింగ్ సమయంలో జరిగిన పరిణామం కలకలం రేపింది. శివబాలాజీ చేతిని నటి హేమ కొరకటం కలకలం రేపింది. ఆ తర్వాత ఆయన ఆస్పత్రికి వెళ్ళి ముందు జాగ్రత్త చర్యగా టీటీ వేయించుకున్నారు. మరో కీలకమైన కార్యదర్శి పోస్టు కూడా విష్ణు ప్యానలే దక్కించుకునే సూచనలు కన్పిస్తున్నాయి.