మా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి..జీవిత‌పై ర‌ఘుబాబు గెలుపు

Update: 2021-10-10 15:20 GMT

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అయినా..మ‌రో సంఘం అయినా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి అత్యంత కీల‌కం అయిన‌ది. ఈ కీల‌క మైన జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ పోస్టును కూడా విష్ణు ప్యాన‌లే ద‌క్కించుకుంది. అతి త‌క్కువ ఓట్ల‌తో అయినా జీవిత‌ను ర‌ఘుబాబు ఓడించ‌టం కీల‌క ప‌రిణామంగా మారింది. మా ఎన్నిక‌ల్లోకి జీవిత కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఆమె ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ లోకి తీసుకోవ‌టంపై తొలుత బండ్ల గ‌ణేష్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

త‌ర్వాత ఆమెకు పోటీగా స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా బ‌రిలో నిలుస్తూ నామినేష‌న్ కూడా వేశారు. కానీ త‌ర్వాత అక‌స్మాత్తుగా పోటీ నుంచి త‌ప్పుకుని అంద‌రికీ షాకిచ్చారు. అయితే ఎన్నిక‌ల‌కు ఒక రోజు ముందు మాత్రం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోస్టుకు మాత్రం ర‌ఘుబాబుకు ఓటు వేయాలంటూ ఆయన ట్వీట్ చేశారు. బండ్ల గ‌ణేష్ బ‌హిరంగానే జీవిత‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేశారు. కార‌ణాలు ఏమైనా జీవిత మాత్రం ఓట‌మి పాల‌య్యారు. ఓవ‌రాల్ గా చూస్తే విష్ణు ప్యాన‌ల్ ఆదిప‌త్యం సాధించిన‌ట్లు క‌న్పిస్తోంది.

Tags:    

Similar News