మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హాట్ హాట్ గా మారుతున్నాయి. తాజాగా బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చి తాను ఇండిపెండెంట్ గా జనరల్ సెక్రటరీగా పోటీచేయనున్నట్లు ప్రకటించారు. జీవిత రాజశేఖర్ ప్యానల్ లోకి రావటం తనకు నచ్చలేదని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశంపై జీవిత స్పందించారు. ఆమె ఓ చానల్‌తో మాట్లాడుతూ..బండ్ల గణేశ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు.
'మా'లో సభ్యులుగా ఉన్న వారు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను గెలిచినా లేదా ఓడినా 'మా' అభివృద్దికి పనిచేసి తీరతానన్నారు. బండ్ల గణేశ్ కూడా 'మా'అభివృద్ది కోసం పోటీ చేస్తున్నట్టు భావిస్తున్నానని, అంతేకాని తనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారని అనుకోవడం లేదన్నారు. గతంలో మెగా ఫ్యామిలీపై జీవిత విమర్శలు చేసినందునే ఆమెను ప్యానల్ లోకి తీసుకోవటాన్ని బండ్లతప్పుపడుతున్నారు.