రచ్చరచ్చగా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల రగడకు ఆదివారంతో తెరపడనుంది. ఈ ఎన్నికలకు సర్వం సిద్దం అయింది. గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ సారి బరిలో నిలిచిన వారు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అంతే కాదు..తొలిసారి ఏకంగా మా ఎన్నికల్లో డబ్బు పంపిణీ ఆరోపణలు కూడా వచ్చాయి. అధికారికంగా..అనధికారికంగా ఇందులోకి ఈ సారి రాజకీయాలు కూడా బాగానే ప్రవేశించాయి.
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లోఆదివారం జరగునున్న మా ఎన్నికల కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ తమ సభ్యులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రేపు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది.సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదేరోజు రాత్రి 8 గంటలలోపు ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.