'లవ్ స్టోరీ' టీజర్ విడుదల

Update: 2021-01-10 07:31 GMT

'జీరోకెళ్లి వచ్చా. చాలా కష్టపడతా సర్.మంచి ప్లాన్ ఉంది. ' అంటూ నాగచైతన్య. జాబ్ గ్యారంటీగా వస్తుంది అనుకున్న ..ఇక హోపే లేదు అంటూ' సాయి పల్లవి. ఈ డైలాగ్ లు అన్నీ ఆదివారం నాడు విడుదల అయిన 'లవ్ స్టోరీ' సినిమా టీజర్ లోనివి. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

అందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్రమోషన్లలో వేగం పెంచింది. ఒక నిమిషం నిడివి గల ఈ టీజర్‌ను యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యేలా రూపొందించారు. టీజర్‌లో 'ఆ సాఫ్ట్ వేర్ జాబ్ ఏం చేస్తావ్.. కళ్లాద్దాలు వస్తాయి. బ్యాక్ పెయిన్ వస్తుంది.. జుట్టు మొత్తం ఊశిపోతుంది' అంటూ నాగ చైతన్య సాయిపల్లవితో చెప్పే డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉంది.

Full View

Tags:    

Similar News