'లైగ‌ర్' ట్రైల‌ర్ వ‌చ్చేసింది

Update: 2022-07-21 04:24 GMT

Full Viewవిజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయ‌న కొత్త సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ ట్రైల‌ర్ తో ఫ్యాన్స్ ను కుషీ చేశాడ‌నే చెప్పొచ్చు. భారీ యాక్షన్ స‌న్నివేశాల‌తో ట్రైల‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది. బాక్సింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. మైక్ టైస‌న్ ఈ సినిమాకు ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉన్నారు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను క‌ర‌ణ్ జోహ‌ర్, ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్ ను గురువారం నాడు టాలీవుడ్ హీరోలు చిరంజీవి, ప్ర‌భాస్ లు సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఇది తొలి పాన్ ఇండియా సినిమా ఇదే. ఇందులో విజ‌య్ త‌ల్లిగా ప్ర‌ముఖ న‌టి ర‌మ్య‌క్రిష్ణ న‌టించింది. ఆగ‌స్టు 2న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Tags:    

Similar News