హీరో నాగశౌర్య పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న 'లక్ష్య' సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా కేతికా శర్మ నటిస్తోంది. జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. 'చాలా మందికి ఆటతో గుర్తింపు వస్తుంది.
కానీ ఎవడో ఒకడు పుడతాడు. ఆటకే గుర్తింపు తెచ్చేవాడు' అన్న జగపతిబాబు డైలాగ్ తో టీజర్ ప్రారంభం అవుతుంది. విలువిద్య ఆటగాడి లక్ష్యంగా ఈ సినిమా సాగుతుంది. టీజర్ లో పడిలేచినవాడితో పందెం చాలా ప్రమాదకరం అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం నాగశౌర్య సిక్స్ ప్యాక్ చేసి పర్పెక్ట్ గా తయారయ్యాడు.