Full Viewఅక్కినేని నాగార్జున నటిస్తున్న సినిమా బంగార్రాజు. సొగ్గాడు మళ్లీ వచ్చాడు ఉప శీర్షికతో ఈ సినిమా వస్తోంది. ఇందులో నాగార్జునకు జోడీగా రమ్యక్రిష్ణ నటిస్తుంటే..మరో జంటగా అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి సందడి చేయనున్నారు. బంగార్రాజు సినిమాకు సంబంధించి లడ్డుండ లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ ను మంగళవారం నాడు విడుదల చేసింది. ఈ పాటలో మరో విశేషం ఉంది. స్వయంగా నాగార్జున ఈ పాట పాడారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వెల్ గా ఇది వస్తోంది.
కురసాల కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ లడ్డుండ పాటలో నాగార్జున వాయిస్ తోపాటు స్పెప్స్ కూడా అదిరాయి. ఇందులో నాగార్జున ఫుల్ ఫ్రెష్ లుక్ లో కన్పించటంతోపాటు ఎనర్జిక్ గా సందడి చేశారు. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఈ పాటకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ 'నాన్నా నీ ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు' కామెంట్ చేశారు నాగచైతన్య.