పెద్దగా సస్పెన్స్ లు ఏమీ లేవు. ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగానే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యారు. మరోసారి మోనాల్ సేఫ్ అయింది. ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిన వారిలో అభిజిత్, అఖిల్, దివి, అరియానాలు ఉన్నారు. చివరి నిమిషం వరకూ టెన్షన్ అంతా మోనాల్, కుమార్ సాయిలపైనే కొనసాగింది. చివరిగా సేవ్ అయిన అరియానా నామినేషన్ లో మిగిలిన ఇద్దరు కుమార్ సాయి,
మోనాల్ లో ఎవరిని సేవ్ చేస్తావని నాగార్జున అరియానాను ప్రశ్నించగా..గేమ్ పరంగా చూస్తే తాను కుమార్ సాయిను సేవ్ చేస్తానని తెలిపారు. ఆ వెంటనే నాగార్జున మోనాల్, కుమార్ సాయిలను బ్యాగ్ సర్దుకుని కన్ఫెక్షన్ రూమ్ కు రావాల్సిందిగా కోరారు. అయితే మోనాల్ ను కన్ఫెక్షన్ రూమ్ లో ఉండమని...కుమార్ సాయిను పిలిచారు నాగార్జున. మిగిలిన సభ్యులతో పోలిస్తే ఎలిమినేషన్ అయిన తర్వాత కూడా కుమార్ సాయి కూల్ గా వెళ్లిపోయాడు.