రవితేజ ఫ్యాన్స్ కు షాక్

Update: 2021-01-09 07:30 GMT

థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత వస్తున్న కీలక సినిమా 'క్రాక్'కు బ్రేక్ వచ్చింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ కు షాక్ తగిలింది. వాస్తవానికి ఈ సినిమా శనివారం ఉదయమే విడుదల కావాల్సి ఉండగా..ఆర్ధిక సమస్యలతో వాయిదా పడింది. మధ్యాహ్నం నుంచి షోలు ప్రారంభం అవుతాయని ప్రకటించినా దీనిపై క్లారిటీ రాలేదు. మహారాజ్‌ రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ దాదాపు 1000 థియేటర్లలో ప్రదర్శించబడేందుకు సిద్ధంగా ఉంది.

క్రాక్‌పై రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో ఈ సినిమా విడుదల ఆగిపోయింది. ఈ విషయాన్ని థియేటర్ల యజమానులు ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. శుక్రవారం రాత్రి అంటే 8వ తేదీనే అమెరికాలో ప్రీమియర్స్ పడాలి. అనివార్య కారణాల వల్ల అవి కాస్తా రద్దు అయ్యాయి. షో రద్దు అయిందని, డబ్బులు రిఫండ్ చేస్తామని తమకు వచ్చిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. అమెరికాలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో 'క్రాక్' మార్నింగ్ షో రద్దు అయింది.

Tags:    

Similar News