Full Viewఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి భీమ్ తిరుగుబాటు (Revolt of Bheem) పేరుతో చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం ఓ వీడియో సాంగ్ ను విడుదల చేసింది. 'భీమా నిన్ను కన్న నేల తల్లి...ఊరిపిపోసిన చెట్టు చేమా, పేరు పెట్టిన గోండు జాతిని నీతో మాట్లాడుతున్నా. వినబడుతోందా?' అంటూ భీమ్ పాత్రను పరిచేసిన తర్వాత కొమరం భీముడో..కొమరం భీముడో అంటూ భైరవ ఆలపించిన ఈ గీతం ఆకట్టుకునేలా ఉంది.ఇందులో విజువల్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీ దగ్గరకొస్తుండటంతో చిత్ర యూనిట్ ఓ రేంజ్ లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్ కూడా గత కొన్ని రోజులుగా ఇదే పనిలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్ కు సంబంధించి విడుదలైన ఈ పాట కూడా సినిమా ఎంత గ్రాండ్ తో ఉండబోతుందో స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ పాట రావటంతో త్వరలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించి కూడా ఇదే తరహా వీడియో రావటం ఖాయంగా భావిస్తున్నారు.