వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ కథా నేపథ్యంలో గని సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి చిత్ర షూటింగ్ పూర్తయినా కరోనా థర్డ్ వేవ్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని చిత్ర యూనిట్ శనివారం నాడు ఈ సినిమాకు సంబంధించి తమన్నా చేసిన ప్రత్యేక పాటను విడుదల చేసింది. ఈ లిరికల్ సాంగ్ లో తమన్నా స్టెప్పులు ఎప్పటిలాగానే అదిరిపోయాయి. కథకు అనుగుణంగానే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. హారికా నారాయణ్ ఈ పాటను పాడారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు.