బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్టే

Update: 2025-10-10 15:08 GMT

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన మూవీ కిష్కిందపురి. సెప్టెంబర్ 12 న విడుదల అయిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లను సాధించింది. ఈ సినిమా విడుదల అయిన రోజే అప్పటికే మార్కెట్ లో మంచి బజ్ ఉన్న మిరాయి మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయినా సరే కంటెంట్ పై ఉన్న నమ్మకంతో కిష్కిందపురి చిత్ర యూనిట్ కూడా అదే రోజు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ మూవీ తో చాలా రోజుల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కు హిట్ దక్కినట్లు అయింది అనే చెప్పొచ్చు.

                                  ఈ మూవీ ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. ఈ సినిమా ఓటిటి డేట్ కు సంబంధించి రకరకాల తేదీలు ప్రచారంలోకి వచ్చాయి. వీటి అన్నిటికి తెర దించుతూ అధికారికంగా ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. దీని ప్రకారం ఈ మూవీ అక్టోబర్ 17 సాయంత్రం ఆరు గంటల నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు ఈ సినిమాను అక్టోబర్ 19 న జీ టీవీ లో ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని దక్కించుకుంది. దీంతో ఇప్పుడు ఓటిటి లో కూడా ఈ సినిమా కు మంచి ఆదరణ దక్కుతుంది అనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది.

Tags:    

Similar News