కిరణ్ అబ్బవరం ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా స్టోరీ ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే గొప్ప మహా సంగ్రామం అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మూవీకి ఇంద్రపుత్ర అనే టైటిల్ ని ఫిక్స్ చేసి...టైటిల్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఇంద్రపుత్ర మూవీ వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా ప్రెజంట్ చేయబోతున్నాయి. ఈ యువ హీరో నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇటీవల విడుదల అయి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని దక్కించుకుంది.