విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా జులై 31 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందు ప్రకటించిన దాని ప్రకారం అయితే ఈ సినిమా జులై 4 న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో విడుదల వాయిదా వేసిన చిత్ర యూనిట్ సోమవారం నాడు కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కు జోడిగా భాగ్య శ్రీ భోర్సే నటిస్తోంది. కింగ్డమ్ సినిమా తెలుగు తో పాటు హిందీ, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ని సితార ఎంటర్ టైన్మెంట్స్ , శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.
ఈ సినిమా లో సత్య దేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కింగ్డమ్ సినిమా రెండు భాగాలుగా రానుంది అని నిర్మాత నాగవంశీ గతంలో ప్రకటించారు. మరో వైపు ఓటిటి తో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ సినిమా కూడా పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన హరి హర వీర మల్లు సినిమా విడుదల కు ఒక రోజు తేడా తో అంటే జులై 25 న విడుదల చేయాల్సి ఉంటుంది అని ప్రచారం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అయిన వారం తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.