కైరా అద్వానీ బాలీవుడ్ హీరోయిన్ అయినా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎందుకంటే ఇప్పటికే ఆమె తెలుగులో చాలా సినిమాలు చేసింది..ఇంకా చేస్తూనే ఉంది. తాజాగా ఆమెకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటి అంటే ఈ భామ 1.6 కోట్ల రూపాయలు పెట్టి ఆడి ఏ8ఎల్ కారు కొనుగోలు చేసింది. ఈ కారుతో పాటు కియారా అద్వానీ ఉన్న ఫోటో వైరల్ గా మారింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ కారు మూడు లీటర్ల వీ6 పెట్రోల్ ఇంజన్ తో ఉంటుంది. విలాసవంతమైన ఈ ఆడి ఏ8 మోడల్ ను కంపెనీ భారతీయ మార్కెట్లో 2020లో ప్రవేశపెట్టింది.