ఖుషీ కి రెండు రోజుల్లో 51 కోట్ల గ్రాస్

Update: 2023-09-03 10:23 GMT

హీరో విజయదేవరకొండ ఫుల్ ఖుషి ఖుషిగా ఉన్నాడు. ఇది తమ ఫ్యామిలీ కు ఖుషీ నామ సంవత్సరం అంటున్నాడు. ఎందుకంటే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం నమోదు చేసుకుందో అందరికి తెలిసిందే. ఇప్పుడు విజయదేవరకొండ, సమంతలు కలిసి నటించిన సినిమా ఖుషీ కూడా మంచి విజయం సాధించినట్లు చిత్ర యూనిటీ చెపుతోంది. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 51 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది.

మరో వైపు ఈ సినిమా సక్సెస్ ఆనందంలో ఉన్న విజయదేవరకొండ తన కుటుంబ సభ్యులతో పాటు సినిమా దర్శకుడు శివ నిర్వాణం, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, రవి శంకర్లతో కలిసి అయన ఆదివారం నాడు యాదాద్రి ఆలయాన్ని సందర్శించుకున్నారు. తమ నిర్మాణ సంస్థకు ఈ ఏడాది రెండు జాతీయ అవార్డులు రావటం కూడా ఎంతో సంతోషం అన్నారు. సోమవారం నాడు వైజాగ్ లో ఖుషీ విజయోత్సవ వేడుకలు చేయనున్నట్లు తెలిపారు.



Tags:    

Similar News