కెజీఎఫ్ 3 కూడా రాబోతుందా?.

Update: 2022-04-14 12:46 GMT

ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే చ‌ర్చ‌. గురువారం నాడు విడుద‌లైన కెజీఎఫ్ 2 సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ య‌శ్ ను ఈ సినిమాలో ఓ సూప‌ర్ హీరోగా చూపించి విజ‌యం సాధించారు. అంతే కాదు..బాలీవుడ్ లోనూ ఏకంగా తొలి రోజే రికార్డు వ‌సూళ్ళు సాధించిన‌ట్లు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్ చేసి ఈ సినిమాపై హైప్ మ‌రింత తీసుకొచ్చారు. సినిమా క్లైమాక్స్ లో క‌న్పించిన సీన్ ఒక‌టి కెజీఎఫ్ 3 కూడా ఉండ‌బోతున్న‌ట్లు సంకేతాలు ఇచ్చింది. కెజీఎఫ్ 2 సినిమా ముగింపు స‌మ‌యంలో ర‌వీనా టాండ‌న్ ఓ పుస్తకాన్ని సీరియ‌స్ గా చూస్తూ ఉంటారు..దానిపై కెజీఎఫ్ 3 అని రాసి ఉండ‌టంతో మూడ‌వ భాగం కూడా ప‌క్కా అని య‌శ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ కెజీఎఫ్ 3 కూడా తీయాలంటూ ట్విట్ట‌ర్ లో కామెంట్స్ పెడుతున్నారు. మ‌రి చిత్ర యూనిట్, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఈ అంశం ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. భారీ బడ్జెట్‌తో నిర్మించిన కేజీఎఫ్ 2లో యష్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు.

ఆర్ఆర్ఆర్ తో పోలిస్తే ఎక్కడా పెద్ద హడావుడి చేయకుండా ప్రమోషన్స్‌లో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్, హీరో య‌శ్ లు కూల్ గా ఉన్నారు. మీడియా నుంచి కెజీఎఫ్ 3పై ప్ర‌శ్న‌లు వెలువ‌డినా వాళ్లు దీనిపై నేరుగా ఎలాంటి స్ప‌ష్ట‌మైన స‌మాధానం ఇవ్వ‌లేదు. అయితే కెజీఎఫ్ 2 క్లైమాక్స్ లో చూపించిన స‌న్నివేశంతో మూడ‌వ భాగం కూడా ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ వ‌సూళ్ళ‌ను అందుకున్నా ఆశ్చ‌ర్యంలేద‌నే టాక్ న‌డుస్తోంది. య‌శ్ ఈ సినిమా రెండు భాగాల‌తో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఇదిలా ఉంటే ఒక‌వేళ కెజీఎఫ్ 3 ప‌ట్టాలెక్కించాల‌న్నా కూడా దీనికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. దీనికి కార‌ణం ప్ర‌శాంత్ నీల్ చేతిలో ఇప్ప‌టికే ప‌లు ప్రాజెక్టులు ఉండ‌ట‌మే.

Tags:    

Similar News