రాకీ బాయ్ వస్తున్నాడు. మరో సారి తన సత్తా చాటబోతున్నాడు. కెజీఎఫ్ సినిమా ఎంత సంచలనం నమోదు చేసిందో తెలిసిందే. ఇప్పుడు సినీ అభిమానులు కెజీఎఫ్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ శనివారం నాడు కీలక ప్రకటన చేశారు. 'హెచ్చరిక. ముందు ప్రమాదం పొంచి ఉంది' అంటూ హీరో యశ్ పోస్టర్ తో విడుదల తేదీని వెల్లడించారు. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ అప్ డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. కెజీఎఫ్ చాప్టర్ 2 పేరుతో ఈ సినిమా విడుదల కానుంది.