కీర్తిసురేష్. టాప్ హీరోల పక్కన హీరోయిన్ పాత్రలు చేస్తూ దూసుకెళుతోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన సర్కారువారి పాటలో నటిస్తోంది. ఇప్పుడు కీర్తిసురేష్ చిరంజీవికి చెల్లెలుగా కన్పించబోతుంది. రాఖీ రోజు ఈ విషయం తేలిపోయింది. 'భోళా శంకర్' సినిమాలో కీర్తి సురేష్ ఈ కీలక పాత్రలో నటించనుంది.
ఆదివారం నాడు చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమాపై ప్రకటన చేసిన విషయం తెలిపిందే. దీంతోఈ పాటు చిరంజీవికి కీర్తి సురేష్ రాఖీ కడుతున్న వీడియోను కూడా విడుదల చేశారు. దీంతో ఈ సినిమాలో కీర్తి పాత్ర ఖరారైపోయింది. చిరంజీవి నటిస్తున్న 154 వ చిత్రం ఇది.