వకీల్ సాబ్ 'కంటిపాట' పాట విడుదల

Update: 2021-03-17 12:55 GMT

వకీల్ సాబ్ సినిమా నుంచి మరో పాట వచ్చింది. 'కంటిపాప' అంటూ సాగే లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ మెలోడి సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతిహాసన్ ల మధ్య సాగిన ఈ ప్రేమ గీతాన్ని ఆర్మాన్ మాలిక్ ఆలపించారు.

బాలీవుడ్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 9 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇఫ్పటికే వకీల్ సాబ్ సినిమా నుంచి మగువా..మగువా పాటతోపాటు సత్యమేవ జయతే పాటలు విడుదల అయ్యాయి. బుధవారం నాడు విడుదల అయింది ఈ సినిమాకు సంబంధించి మూడవ పాట.

Full View

Tags:    

Similar News