కాజల్ అగర్వాల్ మంచి మూడ్ లో ఉంది. అంతే కాదు మంచి మూడ్ లో ఉన్నప్పుడే స్విమ్మింగ్ చేయగలం అంటూ చెబుతోంది. సంతోషంలోనే సొంత అలలు సృష్టించుకోవచ్చని రాసుకొచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో ఇలా సరదా సరదాగా సృష్టించిన సొంత అలలతో ఫోటో దిగి..దీన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ భామ. పెళ్ళి తర్వాత కూడా సినిమాలు చేస్తూ ముందుకెళుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో నిత్యం హంగామా చేస్తూనే ఉంటుంది.