దేవర సందడి షురూ

Update: 2024-08-02 15:02 GMT

Full Viewఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. ఈ సినిమా సెకండ్ సింగిల్ పై చిత్ర యూనిట్ శుక్రవారం నాడు అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలోని పాటను ఆగస్ట్ ఐదున విడుదల కానుంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లతో కూడిన లుక్ తో ఈ సమాచారం ఇచ్చింది. గుండెలు నిండే సమయం అంటూ ఈ లుక్ ను విడుదల చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

                                        ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు భాగాలుగా రానున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ఇప్పటికే వచ్చిన లుక్స్ తో వెల్లడవుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఇదే కావటంతో ఆయన ఫ్యాన్స్ దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ ఐదున విడుదల కావాల్సి ఉండగా..తర్వాత విడుదల తేదీని మార్చారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ఇక నుంచి వరస పెట్టి అప్ డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది అని చెపుతున్నారు.

Tags:    

Similar News