అమెరికాలో జాతిరత్నాలు 'రికార్డు' వసూళ్ళు

Update: 2021-03-26 10:47 GMT

జాతిరత్నాలు సినిమా బాక్సాఫీస్ వద్ద తన హంగామాను కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలోనూ రికార్డు వసూళ్ళు సాధిస్తూ ముందుకు సాగుతోంది. చిన్న సినిమాగా ప్రేక్షకులకు ముందు వచ్చిన ఈ సినిమా వసూళ్ళపరంగా పెద్ద పెద్ద రికార్డులు నమోదు చేస్తోంది. నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమా ఫస్ట్ డే..ఫస్ట్ షో నుంచే మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది.

కరోనా తర్వాత అది కూడా కేవలం 50 శాతం సామర్ధ్యం మాత్రమే అనుమతిస్తున్న అమెరికాలో మిలియన్ డాలర్లు సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. కరోనా తర్వాత మిలియన్ డాలర్లు సాధించిన సినిమాగా జాతిరత్నాలు నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ కుషీకుషీగా ఉంది. కొద్ది రోజుల క్రితం సినిమా ప్రమోషన్స్ కోసం నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి అమెరికా కూడా వెళ్లారు.

Tags:    

Similar News