
డీజె టిల్లు, టిల్లు స్క్వేర్ తర్వాతే సిద్దు జొన్నలగడ్డ రేంజ్ ఒక్క సారిగా మారి పోయింది. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినా కూడా అవి పెద్దగా లెక్కలోకి వేసుకోతగ్గవి కావు అనే చెప్పాలి. వరసగా రెండు సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత అదే హీరో మూడవ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే దానిపై అంచనాలు భారీగా ఉండటం సహజమే. పైగా బొమ్మరిల్లు వంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు భాస్కర్, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్ కావటంతో జాక్ పై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. అయితే జాక్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది.
సిద్దూ హ్యాట్రిక్ విజయానికి బ్రేక్ పడింది. బొమ్మరిల్లు భాస్కర్ మరో సారి ప్రేక్షకులని నిరాశపరిచాడు అనే చెప్పాలి. సినిమా లో ప్రేక్షుకులు పూర్తి స్థాయిలో ఎంగేజ్ కావాలంటే కామెడీ అయినా ఉండాలి..లేదు అంటే కథ అయినా అంత గ్రిప్పింగా ఉండాలి. కానీ జాక్ సినిమా లో మాత్రం ఈ రెండూ లేవు. దీంతో ఇది మరో రొటీన్ రా సినిమాగా మిలిగిపోయింది. జాక్ లాంటి కథతో ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. తన కొడుకు కు దేనికి పనికి రాకుండా పోతాడు అనే టెన్షన్ లో తండ్రి ... ఎలాగైనా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు అనే నమ్మే తల్లి . మరి ఎవరి మాట నిజం అయింది...హీరో తాను అనుకున్న రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)లో ఉద్యోగం సాదించాడా లేదా అన్నదే సినిమా.
అయితే సిద్దు జొన్నలగడ్డ తన పాత సినిమాల ఇమేజ్ నుంచి బయటపడేందుకు ఒక యాక్షన్ సినిమా చేసినా ఈ సినిమా కథలో అంత బలం లేకపోవటం పెద్ద మైనస్ గా మారింది . ఇందులో సిద్దూ తనకు అలవాటు అయిన స్టైల్ లో ప్రేక్షకులను అప్పుడప్పుడు నవ్వించే ప్రయత్నం అయితే చేశాడు. కానీ సినిమాను నిలబెట్టడానికి ఇది ఏ మాత్రం సరిపోలేదు. హీరోయిన్ వైష్ణవి కూడా ఈ మూవీ పై భారీ ఆశలే పెట్టుకున్న ఇందులో ఆమె పాత్రకు కూడా పెద్ద ప్రాధాన్యత లేదు .వీళ్లిద్దరి లవ్ ట్రాక్ కూడా ఏ మాత్రం ఆసక్తికరంగా లేదు . సిద్దూ యాక్షన్ పరంగా మంచిగానే చేసినా ఇది వర్క్ అవుట్ కాలేదు . దీంతో జాక్ మూవీ ఒక రొటీన్ టాలీవుడ్ మూవీగా మిగిలింది అనే చెప్పాలి. కథలో దమ్ములేకపోయినా కూడా సినిమాకు మాత్రం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది అనే చెప్పాలి.
రేటింగ్ : 2 .5 \ 5