అట్లీ..అల్లు అర్జున్ మూవీ అప్డేట్

Update: 2025-04-08 07:01 GMT
అట్లీ..అల్లు అర్జున్ మూవీ అప్డేట్
  • whatsapp icon

అల్లు అర్జున్ 22 వ సినిమా. అట్లీ 6 వ సినిమా. సూపర్ హిట్ కాంబినేషన్ కు అంతా రెడీ. మంగళవారం నాడే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. పుష్ప 2 మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ ఏది అన్న ఆసక్తి గత కొంత కాలంగా కొనసాగుతోంది. కలిసి వచ్చిన కాంబినేషన్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ఒక సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ఖరారు అయింది. ఇది 2025 చివరిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని ఇటీవలే నిర్మాత నాగ వంశీ అధికారికంగా ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ సినిమాపై ప్రకటన వెలువడింది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ఒక వీడియో ను విడుదల చేశారు.

                                         ఇది చూస్తే అల్లు అర్జున్ కొత్త సినిమా కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నట్లు...ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది అనే తరహాలో కనిపిస్తోంది. ఈ వీడియోలో అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు చూపించారు. ఇది చూసిన తర్వాత ఈ మూవీ తో అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది అని ఆయన ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి స్క్రిప్ట్ తో పని చేయలేదు అని నిపుణులు చెపుతున్న మాటలు ఈ వీడియో లో ఉన్నాయి. పుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1740 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News