టాలీవుడ్ లో గత వారం రోజుల నుంచి మారుమోగుతున్న పేరు రవి తేజ. రవి తేజ హీరో గా నటించిన ఇరుముడి సినిమాకు ఈ మధ్య కాలంలో ఏ సినిమా కు రాని రీతిలో కలెక్షన్స్ వస్తున్నాయి. గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవి తేజ కు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. పాన్ ఇండియా హీరో యష్ నటించిన టాక్సిక్ మూవీకి మంచి టాక్ వస్తే ఆ ప్రభావం ఇరుముడి పై పడుతుంది అని భావించారు. కానీ టాక్సిక్ విషయంలో ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు రాని విధంగా నెగిటివ్ రివ్యూస్ రావటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ బోల్తాకొట్టినట్లు అయింది. అంతే టాక్సిక్ రిలీజ్ అయిన ఆగస్ట్ 26 న తప్ప ఇరుముడి కలెక్షన్స్ జోష్ ఏ మాత్రం తగ్గలేదు.

                                       Full Viewతొలుత టాక్సిక్ కు కేటాయించిన థియేటర్లు కూడా పలు చోట్ల తిరిగి ఇరుముడి వేయటం మొదలు పెట్టారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. విడుదల అయిన తొలి వారంలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 135 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది. ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాను ఓన్ చేసుకోవటంతోనే ఇంత మంచి సెన్సేషనల్ హిట్ దక్కింది అని మైత్రి మూవీ మేకర్స్ పేర్కొంది. ఇంకా ఇరుముడి సినిమా బుకింగ్స్ బాగుండటంతో వారాంతం కలెక్షన్స్ కూడా కలుపుకుంటే రవి తేజ సినిమా తొలిసారి 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల వైపు దూసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. థియేట్రికల్ రన్ పూర్తయ్యే సమయానికి ఇరుముడి కలెక్షన్స్ ఎక్కడ ఆగుతాయో చూడాలి.

Tags: