మూడు రోజుల్లో రెండు కోట్ల మంది సినిమాలు చూశారు

Update: 2023-08-14 14:03 GMT

Full Viewభారతీయ సినిమా పరిశ్రమకు స్వర్ణయుగం వచ్చిందా?. అంటే అవుననే అంటోంది ప్రొడ్యూసర్స్ గిల్డ్ అఫ్ ఇండియా. ఎందుకంటే అగస్ట్ 11 నుంచి 13 వరకు అంటే మూడు రోజుల్లోనే దేశ వ్యాప్తంగా 2 .10 కోట్ల మంది ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూశారు. గత పది సంవత్సరాల కాలంలో ఈ స్థాయిలో ప్రేక్షకులు థియేటర్ల కు రావటం ఇదే మొదటి సారి అని ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధికారికంగా వెల్లడించింది. కరోనా తర్వాత ప్రేక్షుకులు ఎన్ని ఓటిటి లు ఉన్నా థియేటర్లకు రావటంపై గిల్డ్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ మూడు రోజుల కాలంలో 390 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలిపారు. ఇందులో రజనీకాంత్ జైలర్ సినిమా తో పాటు అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 , గదర్ 2 , చిరంజీవి భోళా శంకర్ సినిమాలను ప్రధానంగా ప్రస్తావించారు.

ఇది ఇలా ఉంటే జైలర్ సినిమా గత నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 301 కోట్ల రూపాయల గ్రాస్, 148 కోట్ల రుపాయల షేర్ సాధించి రికార్డు నమోదు చేసింది. ఒక్క తమిళ నాడులోనే 82 కోట్ల రూపాయల వసూళ్లు రాగా. తెలుగు రాష్ట్రాల్లో తమిళ్ వెర్షన్ తో కలుపుకుని 34 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. భోళా శంకర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల రూపాయల గ్రాస్, 25 .36 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఈ ట్రెండ్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో భోళా శంకర్ కంటే జైలర్ వసూళ్లు క్రాస్ అయ్యే అవకాశం ఉంది అని చెపుతున్నారు. 

Tags:    

Similar News