ఆర్ఆర్ఆర్ మూవీ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరక్టర్

Update: 2021-03-02 15:32 GMT

ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ మంగళవారం నాడు కీలక అప్ డేట్ ఇచ్చింది. అత్యంత కీలకమైన ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ కోసం హాలివుడ్ యాక్షన్ డైరక్టర్ నిక్ పోవెల్ ను రంగంలోకి దింపారు. నిక్ పోవెల్, దర్శకుడు రాజమౌళిలు చర్చిస్తున్న వీడియో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

గత కొన్ని రోజులుగా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుంటే...రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కన్పించనున్నారు. 2021 అక్టోబర్ 13న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News