హిట్ 3 లో కెజీఎఫ్ భామ

Update: 2024-10-03 04:19 GMT

హీరో నాని మంచి జోష్ మీద ఉన్నాడు. వరస విజయాలతో దూసుకెళుతున్నాడు. ఇటీవలే వెరైటీ టైటిల్ సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏకంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. నాని ఇప్పుడు దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న హిట్ 3 మూవీ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కెజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి నటించనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

                                              ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ఈ మూవీని 2025 మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్, హిట్-2 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్లుగా నిలిచాయి. దీంతో ఇప్పుడు నాని నటిస్తున్న హిట్ 3 పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. 

Tags:    

Similar News