విశ్వంభర హీరోయిన్ ఫిక్స్ అయింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాలోకి త్రిష ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఎప్పుడో పద్దెనిమిది సంవత్సరాల క్రితం స్టాలిన్ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించిన త్రిష సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ డైరెక్ట్ తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినట్లు అయింది. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో చిరంజీవికి జోడిగా అనుష్క శెట్టి , మృణాల్ ఠాకూర్ నటించే అవకాశం ఉంది అనే వార్తలు వచ్చాయి. అందుకు బిన్నంగా త్రిష విశ్వంభర సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న వీడియో ను నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ షేర్ చేసింది. దీంతో హీరోయిన్ సస్పెన్స్ కు తెరపడినట్లు అయింది. చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నెక్స్ట్ సంక్రాంతికి ముందే స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు.