ఉదయం రామ్ చరణ్. సాయంత్రం వరుణ్ తేజ్. ఒక్క రోజులోనే ఇద్దరూ కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. తేలికపాటి లక్షణాలతో తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుని..ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు వెల్లడించాడు. త్వరలోనే మళ్ళీ బయటకు వస్తానని పేర్కొన్నాడు.