'మామా మశ్చీంద్ర' ఏందో ఈ మాయ

Update: 2023-03-01 07:29 GMT

అసలు ఈ ఫోటో లో ఉన్నది చెపితే తప్ప సుదీర్ బాబు అని గుర్తు పట్టడం కష్టమే. ఎందుకంటే మరి అయన అలా మారిపోయారు. గత కొంత కాలంగా అయన సిక్స్ ప్యాక్ తో ఫుల్ ఫిట్ గా మారిపోయారు. ఇటీవల విడుదల అయినా హంట్ సినిమాలోనూ అలాగే కనిపించారు. ఇప్పుడు లుక్ మార్చారు. షాకిచ్చారు అనే చెప్పాలి. సుధీర్ బాబు ఇప్పుడు 'మామా మశ్చీంద్ర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో సుధీర్ బాబు మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు అని టాక్.

                                      నటుడు, రచయిత కూడా అయినా హర్షవర్ధన్ దీనికి దర్శకుడు. ఈ సినిమా నుండి మూడు పాత్రల్లో దుర్గా అనే పాత్ర పోషిస్తున్న సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ని ఈరోజు విడుదల చేశారు. సునీల్ నారంగ్ పీ. రామ్ మోహన్ రావు లు ఈ చిత్రానికి నిర్మాతలు. పొడవాటి జుట్టు, గడ్డంతో సుధీర్ బాబు ఇక్కడ చాలా లావుగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తేనే షాక్ తగులుతుంది అని చెప్పొచ్చు. అలా ఉన్నాడు సుధీర్ బాబు మరి. శ్రీదేవి సోడా సెంటర్ సినిమా తర్వాత సుదీర్ బాబు కు సరైన హిట్ దక్కటం లేదు. 

Tags:    

Similar News