సొంత బ్యానర్ లో నిర్మాణం

Update: 2024-09-24 16:05 GMT

Full Viewహీరో సుధీర్ బాబు కు హిట్ సినిమా లేక చాలా కాలమే అయింది. ఆయన హీరోగా నటించిన మా నాన్న సూపర్ హీరో సినిమా అక్టోబర్ 11 న విడుదల కానుంది. ఇది ఇలా ఉండగానే సుధీర్ బాబు కొత్త సినిమా కు రెడీ అయిపోతున్నాడు. అదే జటాధర. ఈ సినిమా న్యూ లుక్ ను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది. ఇందులోనే త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించారు. వెంకట్ కళ్యాణ్ ఈ సినిమా కు కథ అందించటంతో పాటు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు.

                                                 టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన ఈ సినిమా సుధీర్ బాబు కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే. ఈ సినిమాను హీరో సుధీర్ బాబు సొంత బ్యానర్ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ , ప్రేరణ అరోరా సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సినిమా ఫలితాలను ఏ మాత్రం పట్టించుకోకుండా సుధీర్ బాబు కొత్త సినిమా లు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి రాబోయే రెండు ప్రాజెక్ట్ లు అయనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి. 

Tags:    

Similar News