హీరో రామ్ చరణ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజా టెస్టుల్లో తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. ఎప్పుడెప్పుడు సెట్స్ లో అడుగు పెట్టాలా? అని ఎదురు చూస్తున్నానని అన్నారు. తను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రామ్ చరణ్ డిసెంబర్ 29న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో హోం క్వారంటైన్‌లోకి వెళ్ళారు. రామ్ చరణ్ ఓ వైపు ఆర్ఆర్ఆర్ తోపాటు తాను స్వయంగా నిర్మాతగా ఉన్న ఆచార్యలోనూ కీలక పాత్ర పోషిస్తున్నరు. ఆచార్యలో చిరంజీవి హీరో అన్న విషయం తెలిసిందే.