హీరో రామ్ కు మహేష్ బాబు హిట్ ఇస్తాడా?!

Update: 2024-10-12 16:38 GMT

Full Viewహీరో రామ్ గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్నాడు. ఆయన లేటెస్ట్ మూవీస్ డబుల్ ఇస్మార్ట్ , స్కందా లు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం దర్శకుడు హరీష్ శంకర్ త్వరలోనే హీరో రామ్ తో కలిసి సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు రామ్ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఈ సినిమా దర్శకుడు పి. మహేష్ బాబు అయితే...మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇది హీరో రామ్ 22 వ మూవీ . త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుపుతూ అనౌన్స్ మెంట్ లుక్ విడుదల చేశారు. దర్శకుడు పి. మహేష్ బాబు గత ఏడాది నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టిలతో తీసిన మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.

మరి హీరో రామ్ , మహేష్ బాబు ల కాంబినేషన్ సినిమా ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో వేచిచూడాల్సిందే. ఈ లెక్కన హరీష్ శంకర్ సినిమాను హీరో రామ్ పక్కన పెట్టారా లేక తర్వాత చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. రవి తేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ భారీ హైప్ తో విడుదల అయినా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన భాగ్యశ్రీ భోర్సే ..పాటలు ఆకట్టుకున్నా కూడా ఇవేమి సినిమాను కాపాడలేకపోయిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News