హీరో రామ్ కొత్త సినిమా ఖరారైంది. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి తెరకెక్క ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రానుంది. ఇది హీరో రామ్ 19వ సినిమా. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్6గా శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రామ్ కొత్త సినిమా వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా రామ్ రెడ్ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరో మాస్ సినిమాతో అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రం ఏప్రిల్‌లో చిత్రం సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తోంది. రామ్ నుంచి అప్‌డేట్ అందడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలో ప్రకటించనున్నారు.