పవన్ న్యూ లుక్

Update: 2024-10-12 15:55 GMT

Full Viewహరి హరి వీరమల్లు సినిమా న్యూ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దసరా పండగను పురస్కరించుకుని శనివారం నాడు ఈ లుక్ విడుదల చేయటంతో పాటు పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన పాట ఫస్ట్ సింగిల్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే హరిహర వీరమల్లు షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా జాప్యం కావటంతో పవన్ కళ్యాణ్ తన తొలి ప్రాధాన్యత ఈ సినిమాకే ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా సినిమా.

                                               తెలుగుతో పాటు ఈ మూవీ హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ కు జోడి గా ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తోంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. హరిహర వీర మల్లు షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తన తర్వాత ఫోకస్ ఓజీ సినిమాపై పెట్టే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఓజీ తో పాటు పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేయాల్సి ఉంది. 

Tags:    

Similar News