హ‌నుమాన్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Update: 2021-09-18 07:32 GMT

Full Viewజాంబిరెడ్డి సినిమా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్న సినిమానే 'హ‌ను మాన్'. పాన్ ఇండియా సినిమాగా ఇది తెర‌కెక్కుతోంది. ఇందులో హ‌నుమంతుడుగా తేజ స‌జ్జా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌శాంత్ వ‌ర్మ‌, తేజ స‌జ్జ కాంబినేష‌న్ లోనే జాంబిరెడ్డి కూడా మంచి విజ‌యం ద‌క్కించుకుంది. శ‌నివారం నాడు చిత్ర యూనిట్ హ‌నుమాన్ సినిమాకు సంబంధించి ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది.

దీంతోపాటు ఓ వీడియోను కూడా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇందులో స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఐ ప్రైమ్ షో ఎంట‌ర్ టైన్ మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ హ‌ను మాన్ మూవీ తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం, హిందీలో తెర‌కెక్క‌నుంది.

Tags:    

Similar News